ప్రజావాణి దిననపత్రిక కథనానికి స్పందన.. గుగ్గిళ్లలో వెలిగిన వీధి విద్యుత్ దీపాలు
బెజ్జంకి, ఆగస్టు 4 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామం 2వ వార్డులో వీధి విద్యుత్ దీపాలు వెలగక ప్రజలు రాత్రి వేళల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రజావాణి తెలుగు దినపత్రికలో సోమవారం ప్రచురితమైన కథనానికి అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించారు. ఈ సమస్యను వెలుగులోకి తీసుకువచ్చిన ప్రజావాణి బెజ్జంకి మండల రిపోర్టర్ రాజశేఖర్ రెడ్డికి స్థానిక ప్రజలు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రజావాణి కథనానికి స్పందించిన గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య వెంటనే విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి సమస్య...