*పోలియో రహిత సమాజమే లక్ష్యం ముగిసిన పల్స్ పోలియో*
నడికూడ:28 జూన్( ప్రజావాణి ) జాతీయ పల్స్ పోలియో దినోత్సవం సందర్భంగా ఆదివారం కౌకొండ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో పోలియో చుక్కల కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రెటరీ ముక్కెర సురేష్, కౌకొండ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మేకల చిరంజీవి ముఖ్య అతిథులుగా పాల్గొని, 5 సంవత్సరాల లోపు చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేయించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, “ప్రతి ఒక్క పాపకు పోలియో చుక్క అందించి, మన భవిష్యత్తు తరాలను పోలియో బారి నుండి రక్షించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. తల్లిదండ్రులు ఎవ్వరూ తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించడంలో నిర్లక్ష్యం వహించవద్దు” అని కోరారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఆశా వర్కర్లు, అంగన్వాడి టీచర్ సిబ్బంది, మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పోలియో రహిత సమాజమే లక్ష్యం ముగిసిన పల్స్ పోలియో
RELATED ARTICLES




