prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 June 2026, 7:24 am Digital Edition : PRAJA VANI

పోలియో రహిత సమాజమే లక్ష్యం ముగిసిన పల్స్ పోలియో

*పోలియో రహిత సమాజమే లక్ష్యం ముగిసిన పల్స్ పోలియో*

నడికూడ:28 జూన్( ప్రజావాణి  )  జాతీయ పల్స్ పోలియో దినోత్సవం సందర్భంగా ఆదివారం కౌకొండ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో పోలియో చుక్కల కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రెటరీ  ముక్కెర సురేష్, కౌకొండ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మేకల చిరంజీవి ముఖ్య అతిథులుగా పాల్గొని, 5 సంవత్సరాల లోపు చిన్నారులకు స్వయంగా  పోలియో చుక్కలు వేయించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, “ప్రతి ఒక్క పాపకు పోలియో చుక్క అందించి, మన భవిష్యత్తు తరాలను పోలియో బారి నుండి రక్షించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. తల్లిదండ్రులు ఎవ్వరూ తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించడంలో నిర్లక్ష్యం వహించవద్దు” అని కోరారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ఆశా వర్కర్లు,   అంగన్వాడి టీచర్ సిబ్బంది,  మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.