2) కొత్త కొమ్మర వీధిలోసిమెంట్ రోడ్లను వెంటనే వేయాలి అంటూ పంచాయతీ ఆఫీసు ముందు ధర్నా సిపిఎం
పోరుమామిళ్ల జూలై 10 ప్రజావాణి టౌన్ పరిధిలోని 14 వ వార్డులో 20 సంవత్సరాలుగా రోడ్డు లేక ఎన్నో కష్టాలు పడుతున్నారని పోరుమామిళ్ల పంచాయతీ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది తదనంతరము ఈవోపీఆర్డి కి EO కి వినతి పత్రము ఇవ్వడం జరిగింది,ఈ సందర్భంగా సిపిఎం పోరుమామిళ్ల మండల కార్యదర్శి యన్ భైరవప్రసాదు సిఐటియు మండల అధ్యక్షులు సోమయ్య సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు గౌసియాభేగం వారు ఇరువురు సంయుక్తంగా మాట్లాడుతూ.పోరుమామిళ్ల మండలంలో 15 ఫైనాన్స్ బడ్జెట్ మరియు జనరల్ బడ్జెట్ తో ఎన్ ఆర్ జి ఎస్ బడ్జెట్ తో మండలంలో టౌన్ లో సిమెంట్ రోడ్లు వేసినారని 14 వ వార్డు వీధులలో సిమెంట్ రోడ్లు ఎందుకు వేయలేదని వారు ఆవేదన వ్యక్తపరిచారు 14వ వార్డుకు సంబంధించినటువంటి ప్రజలు ఇంటి పన్ను వాటర్ పన్ను ప్రతి సంవత్సరము తప్పనిసరిగా ముందు భాగంలో ఉండి కడతా ఉందన్నారువార్డు ప్రజలు తీవ్రంగా రోడ్డు లేక గత 20 సంవత్సరాలుగా ఎన్నో కష్టలు పడుతూ ఉన్నారని వారు అన్నారు రాత్రులు పూట ఈ గుంతలు మెట్టలతో ముసలి వాళ్లు గర్భవతులు చాలా మార్లుగా కిందపడి హాస్పిటల్ కూడా వెళ్లడం జరిగింది అన్నారు ఇంతవరకు ఏఅధికారి కానీ రాజకీయ నాయకులు గానీ వీధులలో వార్డులలో సమస్యలు పరిష్కారం చేయడంలో విఫలమైనారని వారు అన్నారు ఇప్పటికైనా పై అధికారులు పూర్తిగా 14వ వార్డు పైన శ్రద్ధ పెట్టి సిమెంట్ రోడ్లు వేయాలని వారి డిమాండ్ చేశారు,ఓట్ల ముందర మేమున్న మేము అభివృద్ధి చేస్తాం అంటూ ప్రజలను మభ్యపెడుతూ ఓటుకు నోటుకు రూపంగా ప్రజలద్వార ఓట్లు వేయించుకొని కుర్చీ ఎక్కి ప్రజలు కట్టే పన్ను రూపంగా వాటర్ పన్ను రూపంగా వచ్చే డబ్బులు అంతా కూడా అప్పనంగా దోచేస్తూ ఖాళీ చేతులు చూపిస్తున్నటువంటి ఈ రాజకీయ నాయకులకు అధికారులకి భవిష్యత్తులో ప్రజలు బుద్ధి చెబుతారని వారు అన్నారు వెంటనే ఎంపీడీవో యువోపిఆర్డి ఈవో చొరవ తీసుకొని 14 వార్డును సందర్శించి అక్కడ ఉన్నటువంటి సిమెంట్ రోడ్డు సమస్యను పరిశీలించి సిమెంట్ రోడ్డు నిర్మాణాన్ని చేయాలని వారు డిమాండ్ చేశారు,రాజకీయ నాయకులకు స్థానిక ఓట్లుఎన్నికలు దగ్గరపడినాయని సిమెంట్ రోడ్డు వేయనందుకు వారికి బుద్ధి చెప్తామన్నారు టౌన్ లో అన్ని వీధులకు 15 ఫైనాన్స్ రూపంలో సిమెంట్ రోడ్డు వేశనారు కానీ 14వ వార్డుకు సంబంధించినటువంటి వార్డులో ఇంతవరకు సిమెంట్ రోడ్డు వేయలేదన్నారు వెంటనే 14 వ వార్డును పోరుమాళ్ళ మండల ఎంపీడీవో పంచాయతీ ఈవో యువోపిఆర్టి సందర్శించి సిమెంట్ రోడ్డును గ్రాంట్ అమలు చేయాలని వారి డిమాండ్ చేశారు లేని పక్షం అయితే 14 ప్రజలతో పోరుమామిళ్ల పంచాయతీ ఆఫీసు ఎంపీడీవో ఆఫీస్ ముట్టడి చేసి పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పేసి సిపిఎం పార్టీగా వారన్నారు.ఈ కార్యక్రమంలో 14 వ వార్డు ప్రజలు నాయిబ్,మున్ని,వెంకటయ్య,ఖాధర్ భాషా,చాంద్ బాషా,ఖాజాభీ,రుభీనా,వుసేన్భ,రహామత్ అంజలి అమ్మన్ని షఫీద్,లాల్ పీరా,పెద్దకాధరమ్మ శంషాన్ సుబ్బయ్య తిరుపాలయ్య రాములమ్మవిజయలక్ష్మి నారాయణ చిన్న కాద్రమ్మ పార్టీ సభ్యులు బీబీ వరాలు,మేరి,ఓబులమ్మ తదితరులు పాల్గొన్నారు
పోరుమామిళ్ల 14వ వార్డు సిమెంట్ రోడ్డు ను వెంటనే వేయాలి ..సిపిఎం డిమాండ్
RELATED ARTICLES



