📄 ePaper
Friday, July 10, 2026
📄 ePaper
HomeతెలంగాణSangareddyఇస్నాపూర్‌లో చోళ గోల్డ్ లోన్స్ నూతన బ్రాంచ్ ప్రారంభం

ఇస్నాపూర్‌లో చోళ గోల్డ్ లోన్స్ నూతన బ్రాంచ్ ప్రారంభం

📰 Generate e-Paper Clip

ఇస్నాపూర్‌లో చోళ గోల్డ్ లోన్స్ నూతన బ్రాంచ్ ప్రారంభం

ఖాతాదారులకు వేగవంతమైన, పారదర్శక సేవలే లక్ష్యం: రీజినల్ బిజినెస్ మేనేజర్ రోజా

ఇస్నాపూర్, జూలై 10 (ప్రజావాణి): ఖాతాదారులకు మెరుగైన, వేగవంతమైన ఆర్థిక సేవలను అందించాలనే లక్ష్యంతో చోళ గోల్డ్ లోన్స్ సంస్థ ముందుకు సాగుతోందని సైబరాబాద్ రీజినల్ బిజినెస్ మేనేజర్ రోజా తెలిపారు. పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్‌లో చోళ గోల్డ్ లోన్స్ నూతన బ్రాంచ్‌ను ఆమె శనివారం లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ, ఖాతాదారులకు అత్యంత వేగంగా, పారదర్శకంగా గోల్డ్ లోన్ సేవలను అందించేందుకు సంస్థ కట్టుబడి ఉందన్నారు. “ఫాస్ట్ సర్వీస్ – బెస్ట్ సర్వీస్” అనే లక్ష్యంతో చోళ గోల్డ్ లోన్స్ సేవలు అందిస్తోందని పేర్కొన్నారు. ఇస్నాపూర్‌లో సంస్థ 80వ బ్రాంచ్‌ను ప్రారంభించడం సంతోషకరమని, ఈప్రాంత ప్రజలకు నాణ్యమైన, విశ్వసనీయ ఆర్థిక సేవలు మరింత చేరువవుతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ శ్రీకాంత్, ఏరియా మేనేజర్ కే. శివప్రసాద్, సంస్థ ప్రతినిధులు, సిబ్బంది, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular