పెద్దపల్లి జూలై 29 ప్రజావాణి :
పెద్దపల్లి జిల్లా నిరుద్యోగ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో జూలై 30, 2026న పెద్దపల్లి TASK రీజనల్ సెంటర్ (RTC బస్ స్టాండ్ సమీపంలో, బస్ డిపో ప్రాంగణం)లో ప్రత్యేక నియామక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సమీపంలోని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఉద్యోగాల కోసం 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹18,000 నుండి ₹21,000 వరకు వేతనంతో పాటు PF, ESI, ఉచిత భోజనం, రవాణా సౌకర్యాలు కల్పించబడతాయని పేర్కొన్నారు.
అదే రోజు బీఎస్సీ కెమిస్ట్రీ మరియు బీఎస్సీ బయోటెక్నాలజీ పూర్తి చేసిన అభ్యర్థుల కోసం మూడు నెలల ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్‌కు నమోదు, ఎంపిక ప్రక్రియ కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా శిక్షణ అందించి, అనంతరం ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వివరించారు.
జిల్లాలోని అర్హులైన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యార్హతల ధృవపత్రాలు, ఆధార్ కార్డు మరియు ఇతర అవసరమైన పత్రాలతో జూలై 30, 2026న ఉదయం 10.00 గంటలకు పెద్దపల్లిలోని TASK రీజనల్ సెంటర్ (RTC బస్ స్టాండ్ సమీపంలో, బస్ డిపో ప్రాంగణం) వద్ద జరిగే ఇంటర్వ్యూలు, నమోదు ప్రక్రియకు హాజరుకావాలని జిల్లా కలెక్టర్ సూచించారు.




