కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (మే05) ప్రొద్దుటూరు మండలం ఈశ్వర్ రెడ్డి నగర్ లో భద్రిపల్లె పద్మ ను ఆమె భర్త బద్రి పల్లి కిరణ్ విషమిచ్చి చంపిన కేసులో భర్తను అరెస్టు చేసినట్లు అడిషనల్ ఎస్పీ విభూ కృష్ణ తెలిపారు.ప్రొద్దుటూరు సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.భార్య లావుగా ఉందన,ఎక్కువ తిండి తింటుందని దానివల్ల చంపినట్లు చెప్పారన్నారు.ఎనిమిదేళ్ల క్రితం వివాహమైందని భద్రిపల్లె కిరణ్ ముద్దనూరులోని వారి మామ ఇంటిలోనే ఉంటున్నాడని,ఏడు సంవత్సరాల కుమార్తె కూడా ఉందన్నారు. భార్యని ఎలాగైనా చంపాలని భావించిన భద్రి పల్లి కిరణ్ నెట్లో సెర్చ్ చేసి 80 వేలు విలువచేసే విష పదార్థాన్ని తెప్పించారన్నారు.భార్యను ప్రొద్దుటూరు మండలం ఈశ్వర్ రెడ్డి నగర్ లోని కిరణ్ తల్లిదండ్రుల ఇంటికి గత నెల 26వ తేదీన తీసుకొచ్చారన్నారు.విషాన్ని 29వ తేదీ రాత్రి భార్యకి విషమిచ్చి ,ఆమె పడిపోయాక దిండు అదిమిపట్టి ఊపిరాడకుండా చేశారన్నారు. అతనికేమీ తెలియనట్లు భార్య కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పారని వివరించారు.మృతురాలు తండ్రి ముద్దనూరు పట్టణానికి చెందిన బెంగుళూరు రాజకుల్లాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారని విచారణలో వాస్తవాలు వెలుగులోకి వచ్చినట్లు పేర్కొన్నారు.పోస్టుమార్టం నివేదిక ఆధారంగా నిందితున్ని అరెస్టు చేసే రిమాండ్ కు పంపినట్లు పేర్కొన్నారు.సమావేశంలో వన్ టౌన్ సిఐ కొండారెడ్డి,ఎస్సైలు మధుసూదన్ రెడ్డి, శ్రీనివాసులు పాల్గొన్నారు
భార్య లావుగా ఉందని,ఎక్కువ తిండి తింటుందని చంపిన,,భర్త
RELATED ARTICLES

