📄 ePaper
Saturday, April 18, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణం చేయాలి.చట్టం కోసం అసెంబ్లీలో తీర్మానం చేయాలి..భారత న్యాయవాదుల సంఘం డిమాండ్

న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణం చేయాలి.చట్టం కోసం అసెంబ్లీలో తీర్మానం చేయాలి..భారత న్యాయవాదుల సంఘం డిమాండ్

📰 Generate e-Paper Clip

కడప జిల్లా ప్రజావాణి న్యూస్(ఏప్రిల్18) కడప న్యాయవాదుల రోజురోజుకు పెరిగిపోతున్న దాడుల నుండి రక్షించడానికి న్యాయవాదుల పరిరక్షణ చట్టాన్ని తక్షణం చేయాలని భారత న్యాయవాదుల సంఘం ఉమ్మడి కడప జిల్లా కమిటీ డిమాండ్ చేసింది.శనివారం ఉదయం కడప రాజారెడ్డి వీధిలోని ఎస్టియు భవన్ భారత న్యాయవాదుల సంఘం కడప ఉమ్మడి జిల్లా న్యాయవాదుల సమావేశం జరిగింది.ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సి సుబ్రహ్మణ్యం ప్రధాన కార్యదర్శి జీవీ మారుతి రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ టి.ఈశ్వర్ అధ్యక్షతన కార్యకర్తల సమావేశం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా కేవీ పల్లి మండలం పాత వడ్డపల్లికి చెందిన యువ న్యాయవాది ఎల్లయ్యను 6 మంది దుండగులు దారుణంగా హతమార్చడం దుర్మార్గమన్నారు. అడ్డు వచ్చిన వృద్ధుడైన అతని తండ్రి వెంకటరమణకు రెండు కాళ్లు రెండు చేతులు విరగ్గొట్టారని తల్లికి బలమైన గాయాలు చేశారని దీనితో వృద్ధులైన తల్లిదండ్రులు సిమ్స్ ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అదేవిధంగా ఈ మధ్యనే ఒంగోలుకు చెందిన హరి ప్రసాద్ అనే యువ న్యాయవాదిని హతమార్చడం,బద్వేలుకు చెందిన న్యాయవాది ఇంటిపై దుండగలు దాడి చేయడం,అనంతపురం బార్ అసోసియేషన్ కు చెందిన చంద్రశేఖర్ చంద్రశేఖర్ రెడ్డిని సర్కిల్ ఇన్స్పెక్టర్ తీవ్రంగా గాయపరచడం జరిగిందని ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో ఏదో ఒక మూల ప్రతిరోజు న్యాయవాదులపై దాడులు పెరిగిపోయాయని ఈ దాడుల నుండి రక్షించడానికి ప్రభుత్వం తక్షణం కఠినమైన న్యాయవాద పరిరక్షణ చట్టాన్ని చేయడానికి బిల్లును అసెంబ్లీ లో తీర్మానం చేయాలని వారు డిమాండ్ చేశారు.ఇప్పటికే రాజస్థాన్,కర్ణాటక,తెలంగాణ రాష్ట్రాలలో న్యాయవాదుల పర్యవేక్షణ చట్టాన్ని తీసుకొచ్చారని అదే తరహాలో మరింత కఠినంగా ఆంధ్రప్రదేశ్లో న్యాయవాదుల పర్యవేక్షణ చట్టాన్ని తక్షణం చేయాలని ఇందుకోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి బిల్లు పెట్టాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం వర్కింగ్ ప్రెసిడెంట్ టి.ఈశ్వర్,ప్రధాన కార్యదర్శి జివి మారుతి రెడ్డి ఉపాధ్యక్షులు,ఆర్ ఆనంద్ కుమార్ రాజగోపాల్ రెడ్డి,సూర్యనారాయణ రెడ్డి,టీ.వీ రమణ,కే.నాగేశ్వర్,డి.నాగ ముని ఇర్షాద్,శివకుమార్,దేవపట్ల నాగేంద్ర, వెంకట శివ,సూర్యనారాయణ రెడ్డి,అర్చన,అనురాధ,ప్రసన్న, బాలసుబ్బయ్య,పాల్ సుధాకర్,ఎస్.నాగేంద్ర,బాలయ్య,రాజశేఖర్ నరసింహ తదితరులు పాల్గొన్నారు.
ఫోటోలు రక్షణ చట్టం కోసం డిమాండ్ చేస్తున్న న్యాయవాదులు సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా అధ్యక్షులు సుబ్రహ్మణ్యం వర్కింగ్ ప్రెసిడెంట్ ఈశ్వర్

RELATED ARTICLES
- Advertisment -

Most Popular