న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణం చేయాలి.చట్టం కోసం అసెంబ్లీలో తీర్మానం చేయాలి..భారత న్యాయవాదుల సంఘం డిమాండ్
కడప జిల్లా ప్రజావాణి న్యూస్(ఏప్రిల్18) కడప న్యాయవాదుల రోజురోజుకు పెరిగిపోతున్న దాడుల నుండి రక్షించడానికి న్యాయవాదుల పరిరక్షణ చట్టాన్ని తక్షణం చేయాలని భారత న్యాయవాదుల సంఘం ఉమ్మడి కడప జిల్లా కమిటీ డిమాండ్ చేసింది.శనివారం ఉదయం కడప రాజారెడ్డి వీధిలోని ఎస్టియు భవన్ భారత న్యాయవాదుల సంఘం కడప ఉమ్మడి జిల్లా న్యాయవాదుల సమావేశం జరిగింది.ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సి సుబ్రహ్మణ్యం ప్రధాన కార్యదర్శి జీవీ మారుతి రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ టి.ఈశ్వర్ అధ్యక్షతన కార్యకర్తల సమావేశం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నమయ్య...