📄 ePaper
Wednesday, July 8, 2026
📄 ePaper
HomeతెలంగాణMedchal-Malkajgiriనూతన విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో రెండో రోజు ప్రత్యేక పూజలు

నూతన విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో రెండో రోజు ప్రత్యేక పూజలు

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, జూలై 4 (ప్రజా వాణి): నూతన విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో భాగంగా శనివారం రెండో రోజు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఉదయం 7 గంటలకు ప్రాతఃకాల అర్చనలతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం నూతన విగ్రహాలకు జలాధివాసం, క్షీరాధివాసం, పంచామృతాభిషేకం, ధాన్యాధివాసం నిర్వహించారు. తదుపరి దుర్గాహోమం, నైవేద్యం, మంత్రపుష్పం నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

సాయంత్రం 5 గంటలకు అమ్మవారి మూలమంత్ర హోమం, శయ్యాధివాసం, పుష్పాధివాసం, నైవేద్యం, మంత్రపుష్పం వంటి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది.

ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షుడు ఎన్. రాములు, చైర్మన్ ఎం. శ్యాం కుమార్, ప్రధాన కార్యదర్శి జే యాదగిరి, కోశాధికారి పి. ఎల్లయ్య, వైస్ చైర్మన్ జి. రవి, సంయుక్త కార్యదర్శి ఎం. మైసయ్యతో పాటు కాలనీ వాసులు, భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేసి, తీర్థప్రసాద గోష్టిని నిర్వహించారు. భక్తుల పాల్గొనికతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular