నూతన విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో రెండో రోజు ప్రత్యేక పూజలు

ఘట్‌కేసర్, జూలై 4 (ప్రజా వాణి): నూతన విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో భాగంగా శనివారం రెండో రోజు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం 7 గంటలకు ప్రాతఃకాల అర్చనలతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం నూతన విగ్రహాలకు జలాధివాసం, క్షీరాధివాసం, పంచామృతాభిషేకం, ధాన్యాధివాసం నిర్వహించారు. తదుపరి దుర్గాహోమం, నైవేద్యం, మంత్రపుష్పం నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. సాయంత్రం 5 గంటలకు అమ్మవారి మూలమంత్ర హోమం, శయ్యాధివాసం, పుష్పాధివాసం, నైవేద్యం, మంత్రపుష్పం వంటి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం...