
వైఎస్ఆర్ కడప జిల్లా జూన్ 26 ప్రజావాణి బద్వేల్ నియోజకవర్గం,కాశీనాయన మండలం పరిధిలోని ఇటుకలపాడు గ్రామంలో మొహరం పండుగ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.ఈ వేడుకల్లో ఉమ్మడి వైఎస్ఆర్ కడప జిల్లా డీసీసీబీ (DCCB) బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.గ్రామానికి విచ్చేసిన ఆయనకు మొహరం పండుగ నిర్వహణ కమిటీ సభ్యులు,గ్రామ పెద్దలు,మరియు ముస్లిం సోదరులు ఘన స్వాగతం పలికారు.అనంతరం ఆయన స్థానిక పీర్ల దర్గాను సందర్శించి, అక్కడ నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంచూరు సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ..పండుగలు అన్ని మతాల మధ్య శాంతి,సామరస్యం,మరియు సోదరభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.సమాజంలో ఐక్యతను బలోపేతం చేయడంలో ఇటువంటి పండుగలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.ప్రజలందరూ మత సామరస్యంతో,కలిసిమెలిసి జీవించాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు,గ్రామ ప్రజలు, యువకులు మరియు ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇటుకలపాడు గ్రామంలో వైభవంగా మొహరం పండుగ వేడుకలు
RELATED ARTICLES



