బద్వేల్ మే17 ప్రజావాణి ఆర్డీవో కార్యాలయం ముందు ఎన్నికలలో ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా ఒకనాటి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పునాదులుగా నిలబడ్డ చేతివృత్తులు నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం నిరాదరణకు గురై తీవ్ర సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం చేతి వృత్తిదారులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని సోమవారం చేతి వృత్తిదారుల సమాఖ్య ఆంధ్ర ప్రదేశ్ బద్వేల్ ఏరియా సమితి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డమాను వీరశేఖర్, సిపిఐ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్ మాట్లాడుతూ.సంపదకు సృష్టికర్తలుగా ఉన్న చేతివృత్తులు నేడు కార్పొరేట్ సంస్థల చేతిలో కకావికలై వలసలు బాట పట్టిన ప్రాంతాలకు సుదూర దేశాలకు పోవుచున్నారని ఆదుకోవాల్సిన పాలకులు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు మాత్రమే ఉపయోగించుకుంటున్నారని జనాభాలో అధిక శాతం ఉన్న చేతి వృత్తుదారులు పూర్తిగా నిర్లక్ష్యానికి నిరాదరణకు గురవుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పటికీ వాటికి నిధులు ఇచ్చి వృత్తిదారుల సంక్షేమానికి పాటుపడడం లేదని కార్పొరేషన్లు అలంకారప్రాయంగా మాత్రమే తయారయ్యాయి బీసీ కార్పొరేషన్ ఆఫీస్ కి వెళ్లి అధికార పార్టీ నాయకులు చెప్పిన వారికి వారి అనుయాయులకు మాత్రమే ఇస్తున్నారని ఇది సరైన విధానం కాదన్నారు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ వారికే ప్రభుత్వ రుణాలు మంజూరు చేస్తే మరి నిజమైన లబ్ధిదారుల పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నించారు అందుకే ఆదరణ పథకంలో దరఖాస్తు చేసుకుని ప్రతి చేతి వృత్తిదారునికి ఐదు లక్షల రూపాయలు రుణం మంజూరు చేసి 90% సబ్సిడీతో వ్యక్తిగత పూచికతతో ఇవ్వాలని అదేవిధంగా 50 సంవత్సరాలు నిండిన ప్రతి వృత్తిదారుడికి పింఛన్ మంజూరు చేయాలని వారు కోరారు అంతేకాకుండా వృత్తిపైన ఆధారపడిన కుటుంబాలకి 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు ఇవ్వాలన్నారు లక్షల కోట్లు బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నప్పటికీ వృత్తిదారుల కోసం నిధులు కేటాయించడం లేదని ఈ చేతి వృత్తిదారులకు ప్రత్యేక గ్రాండ్ కేటాయించాలన్నారు చేతులు దారులు తయారు చేసే ఉత్పత్తుల పైన అమ్ముకోవడానికి మార్కెట్ ఏర్పాటు చేయాలని వారు కోరారు ఈ సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం చొరవ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి పి బాలు ఏరియా సహాయ కార్యదర్శిలు పి వి రమణ ఇమ్మానియేల్, చేతి వృత్తుదారుల సమాఖ్య జిల్లా సహాయ కార్యదర్శి పొంగూరునాగరాజు, పార్టీ జిల్లా సమితి సభ్యులు పడిగే వెంకటరమణ నాయకులు సుబ్బరాయుడు రామయ్య చెన్నయ్య ( రజక వృత్తిదారుల సంఘం ) తిరుమల కొండయ్య( నాయి బ్రాహ్మణ ) వంశ రాజుల సంఘం నాయకులు శివప్రసాద్ కొండయ్య పెంచలయ్య పూసల వృత్తుదారుల సంఘం నాయకులు నాగరాజు లక్ష్మి వడ్డెర సంఘం నాయకురాలు వెంకటమ్మ నాయకులు శివ,సీనయ్య విష్ణు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు
Homeఆంధ్రప్రదేశ్నిరాదరణకు గురవుతున్న చేతి వృత్తిదారులు - సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం
నిరాదరణకు గురవుతున్న చేతి వృత్తిదారులు – సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం
0
11
RELATED ARTICLES
- Advertisment -



