📄 ePaper
Monday, May 11, 2026
📄 ePaper
HomeతెలంగాణMedchal-Malkajgiriనిజాయితీకి నిలువెత్తు నిదర్శనం — మాజీ ఆర్మీ జవాన్ అన్వర్

నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం — మాజీ ఆర్మీ జవాన్ అన్వర్

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, ఏప్రిల్ 27 (ప్రజావాణి):    నిజాయితీ, బాధ్యతాయుత ప్రవర్తనతో ఒక మాజీ ఆర్మీ జవాన్ అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఘట్‌కేసర్‌కు చెందిన మహమ్మద్ అన్వర్, విధుల్లో ఉన్న సమయంలో ట్రైన్‌లో దొరికిన విలువైన వస్తువులను యజమానికి తిరిగి అందజేసి ప్రశంసలు పొందాడు.

మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో సికింద్రాబాద్ నుండి నిజామాబాద్ వెళ్తున్న రైలులో ఒక బ్యాగ్ అన్వర్‌కు దొరికింది. ఆ బ్యాగ్‌లో సుమారు మూడు తులాల బంగారం తో పాటు మరికొన్ని విలువైన వస్తువులు ఉన్నట్లు తెలిసింది.

తన నిజాయితీని చాటుకున్న అన్వర్, వెంటనే సంబంధిత వ్యక్తిని గుర్తించి, నిజామాబాద్‌కు చెందిన మిల్కీస్ భాను కుమారుడికి ఆ బ్యాగ్‌ను అప్పగించాడు. ఈ చర్యతో ప్రయాణికులు మరియు స్థానికులు అతన్ని అభినందించారు.

ఇలాంటి సంఘటనలు సమాజంలో విశ్వాసాన్ని పెంపొందిస్తాయని, అన్వర్ వంటి వ్యక్తులు యువతకు ఆదర్శమని పలువురు పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular