నాన్వెజ్ ఎందుకు వండలేదని అడిగిన భర్తను కొడవలితో కొట్టి చంపిన
ప్రజావాణి
ఎప్పుడు 27
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
నాన్వెజ్ ఎందుకు వండలేదని అడిగిన భర్తను కొడవలితో కొట్టి చంపిన భార్యను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ మేరకు సోమవారం పట్టణ సీఐ నరహరి మీడియాకు వివరాలు వెల్లడించారు పట్టణంలోని గోసంగి కాలనీలో శనివారం రాత్రి పట్టణంలోని గోసంగి కాలనీకి చెందిన కోదండం లక్ష్మిని భర్త శివాజీ నాన్వెజ్ ఎందుకు వండలేదని ప్రశ్నించాడు ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా ఆవేశంతో పక్కనే ఉన్న కొడవలితో శివాజీపై లక్ష్మి దాడి చేసింది. దీంతో శివాజీ అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఈ ఘటనలో నిందితురాలు లక్ష్మిని రైల్వేస్టేషన్ వద్ద పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు
నాన్వెజ్ ఎందుకు వండలేదని అడిగిన భర్తను కొడవలితో కొట్టి చంపిన భార్య
RELATED ARTICLES

