📄 ePaper
Monday, May 11, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కాంగ్రెస్ పార్టీ బలగాన్ని ముట్టుకుంటే "ఖబర్దార్ బిడ్డ షాద్ద్నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ బలగాన్ని ముట్టుకుంటే “ఖబర్దార్ బిడ్డ షాద్ద్నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి

📰 Generate e-Paper Clip

కాంగ్రెస్ పార్టీ బలగాన్ని ముట్టుకుంటే “ఖబర్దార్ బిడ్డ షాద్ద్నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి

ఎల్కగూడెం సర్పంచి బందెయ్యపై జరిగిన దాడి ముక్తకంఠంతో ఖండించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

అండగా నిలబడిన అన్ని మండలాల కాంగ్రెస్ అద్యక్షులు, సీనియర్ నేతలు

చౌదరి గూడెంలో బందెయ్య పై దాడికి నిరసనగా భారీ సభ

భారీ ఎత్తున తరలివచ్చిన సర్పంచులు తదితర నాయకులు

మీ పదేళ్ల అహంకార రాజకీయాలను.. దాడులు చేసే రాజకీయాలను.. కుట్ర పూరిత రాజకీయాలను.. పక్కన పెట్టి స్నేహపూరిత వాతావరణం లో అభివృద్దే అభిమాతంగా పనిచేస్తూ ముందుకు పోతుంటే.. మీ బుద్ధిని మార్చుకోకుండా దాడులు నిర్వహిస్తే.. ఖబర్దార్ బిడ్డ కాంగ్రెస్ బలగాన్ని ముట్టుకుంటే ఖతం చేస్తామంటూ.. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం జిల్లేడు చౌదరిగుడ మండల కేంద్రంలోని విఎన్ గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చలివేంద్రం పల్లి రాజు ఆధ్వర్యంలో ఎలికగూడెం సర్పంచ్ బందయ్య పై జరిగిన దాడికి నిరసనగా మద్దతు సభ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాపరెడ్డి మాట్లాడుతూ… ఒక కాకికి ఏమన్నా జరిగితే చుట్టూ వందలాదిగా కాకులు చేరి రక్షించుకునే ప్రయత్నం చేస్తాయి.. అదే సంస్కృతి అదే ప్రేమ కాంగ్రెస్ పార్టీలో సైతం ఉంటుందని కార్యకర్తకు ఏ ఆపద వచ్చిన పైనున్న మేమందరం అండగా నిలబడతామని చెప్పడానికే ఈ సభకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సూచనతో హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల సంక్షేమాన్ని కోరి ఎన్నో రకాల సంక్షేమ పథకాలు తీసుకువచ్చి గ్రామ గ్రామాన మా సర్పంచ్ ఆధ్వర్యంలో అందిస్తుంటే గతంలో పనిచేసిన వారు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు చేసి అభివృద్ధి చేస్తుంటే జీర్ణించుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్పంచిగా గెలుపొందిన చాకలి బందేయ్య ఇటీవల కాలంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సహకారంతో దాదాపు 40 లక్షల రూపాయల అభివృద్ధి పనులు గ్రామంలో చేపట్టారని అన్నారు. కుట్రపూరిత రాజకీయాలు మీలాగా చేయాలంటే గెలిచిన రెండున్నర సంవత్సరాలలో ఏనాడో చేసే వారమని కానీ సమన్వయంతో ముందుకు సాగుదామని మీలాంటి రాజకీయాలకు స్వస్తి పలకడానికి మేమందరము కంకణం గట్టుకుని అభివృద్ధి అభిమానంగా పనిచేస్తున్నామని అన్నారు. 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల షాద్నగర్ నుంచి పరిగి వరకు నాలుగు లైన్ల రోడ్డు.. గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు వంటి సంక్షేమ పథకాలు అందించే క్రమంలో మేము మీలాంటి చీడపురుగులను పట్టించుకోలేదని ఇప్పుడు మా కార్యకర్తకు ఏ ఆపద వచ్చిన అండగా నిలబడడానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటుందని అన్నారు. ఇదివరకు మీ బుద్ధి మార్చుకుంటారేమో అని ఎదురు చూశాను కానీ మీరు అదే ధోరణిని కొనసాగించినట్లయితే మా పార్టీ కార్యకర్తలు పోలీస్ చర్యలను పక్కనపెట్టి ప్రత్యక్ష దాడుల సైతం చేయడానికి వెనకాడ బొమ్మని హెచ్చరించారు. ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకొని అభివృద్ధికి సహకరించాలని అన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పలువురు మాట్లాడుతూ చాకలి బందెయ్య పై జరిగిన దాడిలో ఎంతటి వారైనా వదిలిపెట్టకుండా కఠిన శిక్ష అమలు చేసే విధంగా పోలీస్ శాఖ కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విశ్వం, రఘు, బాబర్ ఖాన్, కొమ్ము కృష్ణ, కృష్ణారెడ్డి, చంద్రశేఖర్, కేకే కృష్ణ,, జితేందర్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, ఆంజనేయులు, వెంకట నరసింహారెడ్డి, సర్పంచులు శ్వేతా చంద్రబాబు గౌడ్, అరుణ, సనా, నీలయ్య, రామచంద్రయ్య, కుమార్, చందు నాయక్,శశిధర్, ఆయా గ్రామాలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular