📄 ePaper
Saturday, June 27, 2026
📄 ePaper
HomeతెలంగాణKamareddyఆటో రిక్షాల్లో అధిక ప్రయాణికులపై కఠిన చర్యలుడిటిఓ జై శ్రీనివాస్

ఆటో రిక్షాల్లో అధిక ప్రయాణికులపై కఠిన చర్యలు
డిటిఓ జై శ్రీనివాస్

📰 Generate e-Paper Clip

ఆటో రిక్షాల్లో అధిక ప్రయాణికులపై కఠిన చర్యలు
డిటిఓ జై శ్రీనివాస్

ప్రజావాణి
ఏప్రిల్: 27
కామారెడ్డి జిల్లా ప్రతినిధి

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆటో రిక్షాల్లో అధిక సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించుకునే వాహనాలపై రవాణా శాఖ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు.

ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖ అధికారులు రఫీ, మధుకర్ (సహాయక మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు) ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో అధిక ప్రయాణికులతో నడుస్తున్న పలు ఆటో రిక్షాలను గుర్తించి స్వాధీనం (సీజ్) చేసారు.

అధికారులు మాట్లాడుతూ, ఆటో రిక్షా వాహనదారులు తప్పనిసరిగా చట్టబద్ధమైన ధ్రువపత్రాలు కలిగి ఉండాలని, నిర్దేశిత పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించకూడదని సూచించారు. అలాగే రహదారి భద్రత నియమాలను కచ్చితంగా పాటించాలని, ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని హెచ్చరించారు. ఈ తరహా తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular