దామెర గ్రామంలో వడ్డెర సంఘం నూతన గ్రామ కమిటీ
ఎల్కతుర్తి,ప్రజావాణి న్యూస్:-
ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామంలో వడ్డెర సంఘం గ్రామ కమిటీని శుక్రవారం రోజున ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శివరాత్రి రాజమ్మ,జిల్లా మహిళా అధ్యక్షురాలు ఆలకుంట సంధ్య,జిల్లా అధ్యక్షుడు వల్లెపు సమ్మయ్య,జిల్లా ఉపాధ్యక్షుడు వల్లెపు సుధాకర్,జిల్లా కోశాధికారి వల్లెపు సాంబరాజు హుస్నాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు బొంత రమేష్ ఎల్కతుర్తి మండల అధ్యక్షుడు గొల్లెనఎల్లయ్య,ఎల్కతుర్తి ఓరుసు కుమారస్వామి పట్టణ అధ్యక్షులు మండల ఉపాధ్యక్షుడు ఆలకుంట సమ్మయ్య మండల ప్రధాన కార్యదర్శి అల్లేపు ప్రశాంత్ మండల కోశాధికారి అల్లేపు రాజు హాజరై నూతన గ్రామ కమిటీని ప్రకటించారు.
నూతనంగా ఏర్పాటైన దామెర గ్రామ కమిటీలో గ్రామ అధ్యక్షులుగా అల్లేపు తిరుపతి గౌరవ అధ్యక్షులుగా అల్లేపు రవి ఉపాధ్యక్షులుగా ఆలకుంట రాజయ్య ప్రధాన కార్యదర్శిగా అల్లేపు రవి కార్యదర్శిగా గుర్రం సతీష్ కోశాధికారిగా అల్లేపు అశోక్ సహాయ కార్యదర్శులుగా ఆలకుంట లక్ష్మణ్ ఆలకుంట రాజకుమారయ్య ఆలకుంట బాలు యువజన అధ్యక్షుడిగా పల్లపు హరీష్ యువజన నాయకులుగా అల్లేపు శ్రీకాంత్ అల్లేపు వంశీ ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శివరాత్రి రాజమ్మ జిల్లా మహిళా అధ్యక్షురాలు ఆలకుంట సంధ్య జిల్లా అధ్యక్షుడు వల్లెపు సమ్మయ్య జిల్లా ఉపాధ్యక్షుడు వల్లెపు సుధాకర్ జిల్లా కోశాధికారి వల్లెపు సాంబరాజు హుస్నాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు బొంత రమేష్ ఎల్కతుర్తి మండల అధ్యక్షుడు గొల్లెన ఎల్లయ్య,మండల ఉపాధ్యక్షుడు ఆలకుంట సమ్మయ్య,మండల ప్రధాన కార్యదర్శి అల్లేపు ప్రశాంత్,మండల కోశాధికారి అల్లేపు రాజు,నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను అభినందిస్తూ గ్రామంలో వడ్డెర సంఘం బలోపేతం సంక్షేమం మరియు అభివృద్ధి కోసం ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.అలాగే గ్రామ ప్రజల సహకారంతో సంఘాన్ని మరింత బలోపేతం చేసి వడ్డెర సామాజిక వర్గ హక్కుల సాధనకు నిరంతరం కృషి చేయాలని ఆకాంక్షించారు.




