📄 ePaper
Friday, June 26, 2026
📄 ePaper
HomeతెలంగాణKarimnagarదళితుల అభ్యున్నతికి బాబూ జగ్జీవన్ రామ్ చేసిన కృషి చిరస్మరణీయం

దళితుల అభ్యున్నతికి బాబూ జగ్జీవన్ రామ్ చేసిన కృషి చిరస్మరణీయం

📰 Generate e-Paper Clip

అంబేద్కర్  యువజన సంఘం అధ్యక్షులు బోయిని అశోక్

మన ప్రజావాణి ప్రతినిధి (చిగురుమామిడి):భారత మాజీ ఉప ప్రధాని డా. బాబూ జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలో ఘనంగా నివాళులు అర్పించారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ యువజన సంఘం భవనంలో సంఘం అధ్యక్షులు బోయిని అశోక్ ఆధ్వర్యంలో బాబూ జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి స్మరించుకున్నారు. అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు బోయిని అశోక్ మాట్లాడుతూ, అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం బాబూ జగ్జీవన్ రామ్ జీవితాంతం పోరాడారని కొనియాడారు. దేశ స్వాతంత్ర్యం, సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆయన సాగించిన పోరాటం స్ఫూర్తిదాయకమని, సమసమాజ స్థాపన కోసం ఆయన ఆశయాలు మార్గదర్శకమని తెలిపారు.బాబూ జగ్జీవన్ రామ్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆయన ఆశించిన సమానత్వ సమాజాన్ని నిర్మించేందుకు అందరూ ముందుకు రావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మైలారంపూ లచ్చయ్య, కొంకటి మొగిలి, బోయిని రాజు, మామిడి అంజయ్య, బోయిని విజయ్ కుమార్, బోయిని పటేల్, బోయిని అనిల్, చెంచల నాగరాజు, గడ్డం సురేష్, కొడముంజ మధు,మేకల మహేష్, ఎలుక పెళ్లి నవీన్, తిప్పారపు శ్రీనివాస్, గాజపాక సునీల్, అకారపు రాజు, చెంచల రవి, బోయినీ ప్రభాకర్, చెంచల దిలీపు, ఆడెపు తిరుపతి, బోయిని లక్ష్మయ్య, కండె అజయ్, మైలారపూ సునీల్, కనకం రఘు, మోర వంశి, కండే సాయి, బోయిని నవీన్, చెంచల సుధాకర్, చెంచల భూమేష్, బోయిని ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular