📄 ePaper
Friday, June 26, 2026
📄 ePaper
HomeతెలంగాణWarangalకోనాపురంలో ఘనంగా ఈస్టర్ వేడుకలు*

కోనాపురంలో ఘనంగా ఈస్టర్ వేడుకలు*

📰 Generate e-Paper Clip

యేసుక్రీస్తు పునరుత్థానం.. శాంతి సందేశంతో ‘రన్ ఫర్ జీసస్’

*కోనాపురంలో ఘనంగా ఈస్టర్ వేడుకలు*

యేసుక్రీస్తు పునరుత్థానం.. శాంతి సందేశంతో ‘రన్ ఫర్ జీసస్’


చెన్నారావుపేట ఏప్రిల్ 5 (ప్రజావాణి)


లోక రక్షకుడు యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచిన శుభసందర్భాన్ని పురస్కరించుకొని ఆదివారం మండల కేంద్రంలోని కోనాపురం గ్రామంలో ఈస్టర్ వేడుకలను క్రైస్తవులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. క్రీస్తు పునరుత్థానం మానవాళికి శాంతి, నిరీక్షణను ప్రసాదిస్తుందనే సందేశాన్ని చాటుతూ స్థానిక జేడీఈఎం బాప్టిస్ట్ చర్చి ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.ఈ సందర్భంగా పాస్టర్ ఎబినేజర్ నేతృత్వంలో ‘రన్ ఫర్ జీసస్’ కార్యక్రమాన్ని చేపట్టారు. క్రీస్తు శాంతి సందేశాన్ని ప్రజలందరికీ అందించాలనే ఉద్దేశంతో నిర్వహించిన ఈ ప్రదర్శనలో యువకులు, భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం చర్చిలో జరిగిన ప్రత్యేక ఆరాధనలో పాస్టర్ ఎబినేజర్ మాట్లాడుతూ.. ప్రేమ, సహనం, క్షమాగుణమే క్రైస్తవ ధర్మమని, క్రీస్తు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని కోరారు. అనంతరం ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ వేడుకల్లో కొమ్మలు స్వామి, అశోక్, నగేష్, రాజు, భాస్కర్, అనిల్, రాజన్, మహేందర్, రాజేష్, మాణిక్యం, రవి, మల్లేశం, ప్రవీణ్, కార్తీక్, అఖిల్, ప్రశాంత్, ప్రభాస్ తదితరులు  పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular