తోటపల్లి వద్ద కారు అదుపుతప్పి చెట్టుకు ఢీ– ముగ్గురికి స్వల్ప గాయాలు
బెజ్జంకి జూన్ 24 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని దేవక్కపల్లి గ్రామ స్టేజ్ సమీపంలో రాజీవ్ రహదారిపై బుధవారం ఉదయం కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొన్న ఘటనలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం, TS 07 FC 6040 నంబర్ గల మారుతి ఆల్టో కారులో హైదరాబాద్‌కు చెందిన డ్రైవర్ నంగునూరు సంతోష్, పుల్లయ్య, ఆయన భార్య, ఓ బాలుడు కరీంనగర్‌లో జరిగే పెళ్లికి వెళ్తున్నారు. ఈ క్రమంలో తోటపల్లి సమీపంలోని రాజీవ్ రహదారిపై కారు అదుపుతప్పి రోడ్డు...