📄 ePaper
Thursday, June 25, 2026
📄 ePaper
HomeతెలంగాణSangareddyరాయసముద్రం చెరువు అభివృద్ధిపై హైడ్రా కమిషనర్‌కు వినతి

రాయసముద్రం చెరువు అభివృద్ధిపై హైడ్రా కమిషనర్‌కు వినతి

📰 Generate e-Paper Clip

రాయసముద్రం చెరువు అభివృద్ధిపై హైడ్రా కమిషనర్‌కు వినతి

 

రామచంద్రపురం, జూన్ 24(ప్రజావాణి):హైదరాబాద్‌లోని హైడ్రా కార్యాలయంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను రామచంద్రపురం డివిజన్ మాజీ కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఓల్డ్ రామచంద్రపురంలోని రాయసముద్రం చెరువు సుందరీకరణకు రూ.10 కోట్లు, మురుగు నీటి మళ్లింపుకు రూ.2.50 కోట్లతో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు ఇంకా ప్రారంభం కాలేదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

దీనిపై స్పందించిన కమిషనర్ రంగనాథ్, సంబంధిత అధికారులతో మాట్లాడి హైడ్రా సమన్వయంతో త్వరలోనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా డివిజన్ ప్రజల తరఫున కమిషనర్‌కు పుష్పనగేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular