📄 ePaper
Friday, August 7, 2026
📄 ePaper
HomeతెలంగాణSuryapetతాము చదువుకున్న పాఠశాలకు మైక్‌ సెట్‌ అందజేత

తాము చదువుకున్న పాఠశాలకు మైక్‌ సెట్‌ అందజేత

📰 Generate e-Paper Clip

తాము చదువుకున్న పాఠశాలకు మైక్‌ సెట్‌ అందజేత
మనం ఏ స్థాయిలో ఉన్నా.. బాట నేర్పిన బడిని మరువొద్దు
ప్రజావాణి, మోతే, ఆగస్టు 6: తాము చదువుకున్న పాఠశాలకు తమ వంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో సిరికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు ముందుకొచ్చారు. ఎస్సెస్సీ 2000 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు పాఠశాలకు రూ.10 వేల విలువైన మైక్‌ సెట్‌ను అందజేశారు.
మండల విద్యాశాఖ అధికారి కె. గోపాల్‌రావు ఆధ్వర్యంలో పాఠశాలకు మైక్‌ సెట్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ గోపాల్‌రావు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధిలో పూర్వ విద్యార్థులు భాగస్వాములు కావడం అభినందనీయమన్నారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు పూర్వ విద్యార్థులు అందిస్తున్న సహకారానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
తాము ఏ స్థాయిలో ఉన్నా.. తమకు విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాలను, ఉపాధ్యాయులను మరువకూడదని ఆయన అన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రతి బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఎన్. రాము, జి. నగేష్, సరిత, బి. వీరభద్రతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు కోటేశ్వరరావు, శ్రీను, రమేష్, గోవర్ధన్‌రెడ్డి, మల్లీశ్వరి, సాజిత్, సురేష్, రంగయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular