.
కోదాడ, ఆగస్టు 6/ ప్రజావాణి
పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పడాలనే ఉన్నత ఆశయంతో కోదాడలోని స్వర్ణభారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో “పుస్తక దానం – మహాదానం” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ట్రస్ట్ యువ నాయకులు శ్రీ చీదేళ్ళ శ్రీనివాసరావు – నాగలక్ష్మి దంపతుల ఆర్థిక సహకారంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ.. చిన్నారుల చదువుల కోసం సహాయం చేయడం అత్యంత గొప్ప విషయమని కొనియాడారు. పేదరికం కారణంగా ఏ ఒక్కరూ చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. నిరుపేద విద్యార్థులకు అండగా నిలుస్తున్న స్వర్ణభారతి ట్రస్ట్ సామాజిక సేవలని ఈ సందర్భంగా పలువురు అభినందించారు. విద్యార్థులకు పుస్తకాలు అందజేసి, వారిని దీవించారు.అనంతరం సమాజ సేవలో ముందుంటున్న దాతలు శ్రీనివాసరావు దంపతులను ట్రస్ట్ కో-ఆర్డినేటర్స్ వెంపటి వెంకటరమణ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్వర్ణభారతి ట్రస్ట్ సెక్రటరీ జనరల్ చారుగుండ్ల ప్రవీణ రాజశేఖర్, దేవరశెట్టి శంకరరావు, చిట్టిప్రోలు నారాయణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుడు అంకులయ్య తదితరులు పాల్గొన్నారు.





