ఎన్టీఆర్ జిల్లా ప్రజావాణి న్యూస్ (మే12) నందిగామ పట్టణం పరిధిలో గల పాత బస్టాండ్, భారత టాకీస్ వద్ద మూడు వైన్ షాపులు ఒక్కచోటే ఉండటం వల్ల అక్కడి మందుబాబుల వీరంగం రోజు రోజుకి ఆకాశానికి అంటుతుంది.ఈ మందుబాబులు అక్కడే మద్యం సేవించి ఖాళీగా ఉన్న బెంచీలు రోడ్లు ఎక్కడపడితే అక్కడ నిద్ర యాత్రలో ఉంటున్నారు. గాంధీ సెంటర్ భారత టాకీస్ సెంటర్లలో మందుబాబులు బహిరంగంగానే మందు సేవించి టు వీలర్ వాహనాలతో చక్కర్లు కొడుతున్నారు.ఆ సెంటర్ వైపు నుంచి మహిళలు పిల్లలు పెద్దలు రావాలంటే అగ్నిపరీక్షగా మారింది. ఆ సెంటర్లలో నిత్యం రద్దీగా ఉండే చోట మూడు వైన్ షాపులు ఎన్ని పత్రికలలో వార్తలు వెలువడిన మద్యం షాపులు కదిలించే దమ్ము ఎవరికీ లేదంటున్న స్థానికులు. మద్యం ప్రియులు ఆ షాపులలో నుంచి మద్యం సేవించి బయటికి వచ్చిన తర్వాత ఎవరు ఎటువైపు వెళుతున్నారు ముందు వెనక చూసుకోకుండా ఇష్టారాజ్యం అయిపోయింది.ట్రాఫిక్ పోలీసు వారు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించడంలో వెనుముఖం పడుతున్నారు అంటూ ప్రయాణికులు స్థానికులు వాపోతున్నారు.ట్రాఫిక్ పోలీసు వారు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తే మందుబాబులకు చెక్ పెట్టినట్టే.మందుబాబులు మద్యం అక్కడ సేవించకుండా తమ యొక్క గృహాలకు వెళ్లి సేవించుకునే అవకాశాలు ఉన్నాయి అంటున్న ప్రజానికం.ఇప్పటికైనా టాపిక్ పోలీసు వారు స్పందించి రోజు విడిచి రోజు సాయంత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించి గొడవలు అల్లర్లు కాకుండా ప్రజా భద్రత పట్ల చర్య తీసుకోవాలని నందిగామ పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కరువాయే..రెచ్చిపోతున్నా మద్యం బాబులు..
RELATED ARTICLES

