బెజ్జంకి,జూలై 17(ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మహిళపై అత్యాచారం కేసులో నిందితుడు జంగంపల్లి సంతోష్ (33)కు న్యాయస్థానం జీవిత ఖైదు శిక్షతో పాటు రూ.37 వేల జరిమానా విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి వై. జయప్రసాద్ తీర్పు వెలువరించారు.
2022 మార్చి 22న నమోదైన ఈ కేసులో అప్పటి సిద్ధిపేట రూరల్ సీఐ వి. జానకిరామ్ రెడ్డి సమగ్ర దర్యాప్తు చేపట్టి పటిష్టమైన ఛార్జిషీట్‌ను దాఖలు చేశారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సాదుల ఆత్మరాములు వాదనలు వినిపించగా, ప్రస్తుత ఎస్సై టి. తిరుపతి,సీఐ విద్యాసాగర్, లైజనింగ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి, సీడీఓ రవి, భరోసా లీగల్ అధికారి సౌమ్య సమన్వయంతో కేసు విచారణకు సహకరించారు.సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితుడిని దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు శిక్షతో పాటు రూ.37 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది.ఈ కేసులో సమర్థవంతంగా పనిచేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని సిద్ధిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, ఐపీఎస్ అభినందించారు.మహిళలపై నేరాలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు పడేలా చర్యలు కొనసాగుతాయని సిద్దిపేట సీపీ స్పష్టం చేశారు.




