📄 ePaper
Sunday, June 28, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetచీలాపూర్‌లో ఘనంగా మహాత్మ బసవేశ్వర 893వ జయంతి వేడుకలు

చీలాపూర్‌లో ఘనంగా మహాత్మ బసవేశ్వర 893వ జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

 

బెజ్జంకి,ఏప్రిల్ 20(ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని చీలాపూర్ గ్రామంలో మహాత్మ బసవేశ్వర (బసవన్న) 893వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ శానగొండ స్వరూప- భాస్కరచారి ఆధ్వర్యం వహించారు.ఈ సందర్భంగా గ్రామపంచాయతీ ఆవరణలో బసవేశ్వర చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ, తత్వవేత్త- సామాజిక సంస్కర్త అయిన బసవన్న సమానత్వం, సత్యం, న్యాయం వంటి విలువలను సమాజానికి బోధించారని చెప్పారు. “కష్టపడి పనిచేయడమే నిజమైన భక్తి” అనే ఆయన సందేశం నేటికీ మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు.కుల, మత భేదాలకు అతీతంగా మానవతా విలువలను ఆచరణలో పెట్టడం ద్వారా ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కొమ్మెర లక్ష్మారెడ్డి, వార్డ్ మెంబర్ కొంకటి రాములు, అమరాజు మహిపాల్, లింగ బలిజ కులస్తులు, పవాడి నాగయ్య, టేకుమల్ల రాజేశం, పవాడి నాగరాజు, పవాడి ఉమేష్, పవాడి రమేష్, పవాడి హర్షవర్ధన్, పవాడి చరణ్, కాంగ్రెస్ నాయకులు శానగొండ శరత్ కుమార్, బండిపెల్లి శ్రీకాంత్, అమరాజు నవీన్, కొంకటి శ్రీనివాస్, బండ కుమార్, కొంకటి రాజు, పాము వీరేశం గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular