చీలాపూర్‌లో ఘనంగా మహాత్మ బసవేశ్వర 893వ జయంతి వేడుకలు

  బెజ్జంకి,ఏప్రిల్ 20(ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని చీలాపూర్ గ్రామంలో మహాత్మ బసవేశ్వర (బసవన్న) 893వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ శానగొండ స్వరూప- భాస్కరచారి ఆధ్వర్యం వహించారు.ఈ సందర్భంగా గ్రామపంచాయతీ ఆవరణలో బసవేశ్వర చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ, తత్వవేత్త- సామాజిక సంస్కర్త అయిన బసవన్న సమానత్వం, సత్యం, న్యాయం వంటి విలువలను సమాజానికి బోధించారని చెప్పారు. “కష్టపడి పనిచేయడమే నిజమైన భక్తి”...