*చండూర్ లో ఘనంగా బక్రీద్ పండుగ వేడుకలు*
*ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన – చండూర్ సబ్ ఇన్స్పెక్టర్ జె. శివకుమార్*
*చండూర్ ప్రతినిధి (ప్రజావాణి)*
చండూరు పట్టణంలోని గురువారం బక్రీదు పండుగ సందర్భంగా ఈద్గా వద్ద ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మత గురువు ముజాహిద్ మాట్లాడుతూ విశ్వాసానికి, కరుణ, ఐక్యతకు ప్రతీక బక్రీద్ పండుగ అని, ఈ పండుగ రోజున సమస్త మానవాళికి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ త్యాగ నిరతికి, ధర్మ నిబద్ధతకి ప్రతీక , అని ఆయన అన్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో బక్రీద్ పండుగ జరుపుకున్నారు. అనంతరం ముస్లిం సోదరులు ఒకరిని ఒకరు కలిసి శుభాకాంక్షలు తెలియ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కమ్రుద్దీన్ , కరెంట్ షరీఫ్, ఏజాస్, నిరంజన్ అలీ, జిన్నా, సాదక్, షజ్జు పాష , ఉమర్, ఖలీల్, యూనస్, ముజ్జు, లతీఫ్ పాష, రహీం బాబా, హైమద్, జమీల్,షరీఫ్ , జన్ను, వహీద్ , అజీమ్, మాజిద్, ముస్తఫా, రఫీ, జావీద్, తదితరులు పాల్గొన్నారు.


