*
చిలుకూరు జూలై 22(ప్రజావాణి*):చిలుకూరు మండలం సీతారాంపురం స్టేజీ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రయాణికులు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. మిర్యాలగూడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మిర్యాలగూడ నుంచి కోదాడ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.బస్సు సీతారాంపురం స్టేజీ వద్ద ప్రయాణికులను ఎక్కించుకుంటుండగా, వెనుక నుంచి అతివేగంతో వచ్చిన హుజూర్‌నగర్‌కు చెందిన పార్థసారథి ట్రాన్స్‌పోర్టు సిమెంట్ లారీ బస్సును బలంగా ఢీకొట్టింది. ఆ సమయంలో బస్సులో మొత్తం 68 మంది ప్రయాణికులు ఉన్నారు. లారీ బస్సును వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న కోదాడ ఆర్టీవో జిలానీ, చిలుకూరు తహసిల్దార్ ధ్రువ కుమార్ ఏఎస్ఐ ఎస్సై వెంకటేశ్వరరావు ఎస్.కె. సలీం, సతీష్, అరవింద్‌లతో కలిసి వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద తీవ్రతను పరిశీలించిన సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రయాణికులకు ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చిలుకూరులో ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన సిమెంట్ లారీ*
RELATED ARTICLES