📄 ePaper
Friday, July 10, 2026
📄 ePaper
HomeతెలంగాణSangareddyగోకినేపల్లిలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు

గోకినేపల్లిలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

గోకినేపల్లిలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు.

కొమ్మినేని రమేష్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు.

ముదిగొండ జులై 8 ప్రజావాణి ప్రతినిధి
_మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి కొమ్మినేని రమేష్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి, పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొమ్మినేని రమేష్ బాబు మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే వైఎస్సార్ రాజకీయాలకు మూలస్తంభమని, రైతులు, పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. వైఎస్సార్ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజలకు సేవ చేయడం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఆర్గనైజింగ్ కమిటీ సభ్యుడు మీగడ శ్రీనివాస్ యాదవ్, గ్రామ సర్పంచ్ పెరుమాళ్లపల్లి శ్రీనివాస్, ఉపసర్పంచ్ మీగడ శ్రీనివాసరావు, బీఎల్ఏ మీగడ నాగేశ్వరరావు, పొనం రమేష్.గూగులోతు బాబు నాయక్, వార్డు సభ్యులు షేక్ పకీర్ సాహెబ్, కొప్పుల వెంకన్న, మోర్ అర్జున్, నెమలి సంధ్య, పొట్ట భారతి, గుంజులూరి నర్మద, ఇస్మాయిల్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు._

RELATED ARTICLES
- Advertisment -

Most Popular