📄 ePaper
Thursday, July 9, 2026
📄 ePaper
HomeతెలంగాణBhadradri Kothagudemమండల కేంద్రంలో ఎమ్మెల్యే జారే  పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన దమ్మపేట మండల నాయకులు

మండల కేంద్రంలో ఎమ్మెల్యే జారే  పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన దమ్మపేట మండల నాయకులు

📰 Generate e-Paper Clip

మండల కేంద్రంలో ఎమ్మెల్యే జారే  పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన దమ్మపేట మండల నాయకులు

దమ్మపేట, ప్రజావాణి న్యూస్ జులై 08:
అశ్వరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారే ఆదినారాయణ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు 08.07.2026 (బుధవారం) దమ్మపేట పట్టణ కేంద్రంలోని వైయస్సార్ విగ్రహం  నందు వైయస్సార్ జయంతి సందర్భంగా వైయస్సార్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చీకటి శ్రీనివాసరావు అధ్యక్షతన మరియు జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి పొదిలి జ్యోతి మరియు దిశా కమిటీ సభ్యులు సొంగ ఏసుమణి సమక్షంలో మండల అధ్యక్షులు కక్కిరాల రమేష్ మరియు దమ్మపేట టౌన్ అధ్యక్షులు చిన్నంశెట్టి  చిట్టిబాబు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ బర్త్డే కేక్ కటింగ్ చేసి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా శాసనసభ్యులు జారే ఆదినారాయణ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు దమ్మపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు తెలియజేసారు.అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబంధు రూపంలో తొమ్మిది రోజుల్లోనే 9వేల కోట్లను రైతుల ఖాతాలో జమ చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిత్రపటానికి పాలాభిషేకం చేసి, వారికి ధన్యవాదాలు తెలిపిన మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. మరియు జారే ఆదినారాయణ పుట్టినరోజు సందర్భంగా యువ భారత్ శక్తి ఫౌండేషన్ తరపున రక్తదానం చేయబడింది. ఈ కార్యక్రమంలో 30 మందికి పైగా రక్త దాతలు తమ రక్తాన్ని దానం చేశారు.ఈ కార్యక్రమంలో మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకా రమేష్,నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు,సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు , యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, మహిళా అధ్యక్షురాలు,కిసాన్ సెల్ మండల అధ్యక్షులు,ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు,NSUI కాంగ్రెస్, సేవా దళ్ అధ్యక్షులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, సోషల్ మీడియా సభ్యులు మరియు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular