గోకినేపల్లిలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు<br>
గోకినేపల్లిలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు.కొమ్మినేని రమేష్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు.ముదిగొండ జులై 8 ప్రజావాణి ప్రతినిధి_మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి కొమ్మినేని రమేష్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి, పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొమ్మినేని రమేష్ బాబు మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే వైఎస్సార్ రాజకీయాలకు మూలస్తంభమని, రైతులు, పేదలు, బడుగు బలహీన వర్గాల...