📄 ePaper
Monday, May 11, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్గృహ వంట గ్యాస్ దుర్వినియోగం – అతిపెద్ద హోటళ్లకు బ్లాక్‌లో సరఫరా!

గృహ వంట గ్యాస్ దుర్వినియోగం – అతిపెద్ద హోటళ్లకు బ్లాక్‌లో సరఫరా!

📰 Generate e-Paper Clip

ఎన్టీఆర్ జిల్లా ప్రజావాణి న్యూస్ (మే06) జగ్గయ్యపేట పరిసర ప్రాంతంలోని పెద్ద హోటల్ నుంచి చిన్న హోటల్ వరకు డెలివరీ బాయ్స్ చేతుల మీదుగా అక్రమంగా గ్యాస్ మార్పిడి.బ్లాక్‌లో 1500 నుంచి (2000)లకు కొనుగోలు టీ టిఫిన్ భోజనo ధరలు పెంపుతో ప్రజలపై భారం.రెవెన్యూ,సివిల్ సప్లై అధికారులు ఎక్కడ,గ్యాస్ ఏజెన్సీలపై తక్షణ చర్యలు అవసరం.గృహ అవసరాలకు ప్రభుత్వం సబ్సిడీతో అందిస్తున్న వంట గ్యాస్‌ను హోటళ్లకు అక్రమంగా సరఫరా చేస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది,సాధారణంగా ఇంటి అవసరాల కోసం మాత్రమే ఉపయోగించాల్సిన గ్యాస్ సిలిండర్లను కొంతమంది డెలివరీ బాయ్స్,గ్యాస్ ఏజెన్సీల సహకారంతో హోటళ్లకు బ్లాక్‌లో విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.బ్లాక్ మార్కెట్ గ్యాస్‌తో హోటళ్ల వ్యాపారం.హోటల్ యజమానులు కమర్షియల్ గ్యాస్ తీసుకోవడం ఖరీదైనందున తక్కువ ధరకు గృహ గ్యాస్‌ను బ్లాక్‌లో కొనుగోలు చేస్తున్నారు.ఈ అక్రమ సరఫరా కారణంగా హోటళ్లలో టీ టిఫిన్ ధరలు గణనీయంగా పెరిగాయి. ఖర్చు తగ్గినా,వినియోగదారులపై అధిక ధరల భారం మోపడం గమనార్హం.ప్రజలపై భారమై మారిన అక్రమాలు.గ్యాస్ సరఫరాలో అక్రమాలు పెరగడం వల్ల నిజంగా అవసరమున్న గృహ వినియోగదారులకు సిలిండర్లు ఆలస్యంగా అందుతున్నాయి.కొన్నిసార్లు కొరత కూడా ఏర్పడుతోంది.దీంతో సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.అధికారుల నిర్లక్ష్యం పై విమర్శలు.ఈ వ్యవహారం పై రెవెన్యూ,సివిల్ సప్లై అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ,ఇప్పటివరకు ఎలాంటి కఠిన చర్యలు కనిపించకపోవడం ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తోంది స్థానికంగా జరుగుతున్న ఈ అక్రమాలు అధికారుల కంటపడకపోవడం ఆశ్చర్యంగా మారింది.గ్యాస్ ఏజెన్సీలపై విచారణకు డిమాండ్.గ్యాస్ ఏజెన్సీలు,డెలివరీ సిబ్బంది పాత్రపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.అక్రమంగా గృహ గ్యాస్‌ను కమర్షియల్ వినియోగానికి మళ్లించే వారిపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.తక్షణ చర్యలే పరిష్కారం.ఈ అక్రమాలను అరికట్టేందుకు అధికారులు తక్షణమే ఫీల్డ్‌లోకి దిగాలి.గ్యాస్ సరఫరా వ్యవస్థపై పర్యవేక్షణ పెంచి, బ్లాక్ మార్కెట్‌ను పూర్తిగా అరికట్టాలి. లేకపోతే భవిష్యత్తులో ఇది మరింత పెద్ద సమస్యగా మారే అవకాశముంది

RELATED ARTICLES
- Advertisment -

Most Popular