బెజ్జంకి,జూలై 26(ప్రజావాణి )
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని గూడెం గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేపడుతున్న ప్రహరీ గోడ నిర్మాణ పనులను బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్ పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ విద్యార్థుల భద్రత, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని గూడెం గ్రామ ప్రాథమిక పాఠశాలకు రూ.20 లక్షలతో ప్రహరీ గోడ, రూ.6 లక్షలతో కిచెన్ షెడ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేశారని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తోందని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గూడెం గ్రామ సర్పంచ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు గూడెల్లి శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు లింగాల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ రావుల నర్సయ్య, యూత్ ప్రెసిడెంట్ కర్రావుల సందీప్ తదితరులు పాల్గొన్నారు.




