ఎండపల్లి మండలం రాజారాంపల్లికి చెందిన సంగ శ్రీరామ్ చెన్నైలో జరగనున్న జాతీయస్థాయి జూనియర్ హాకీ పోటీలకు ఎంపికయ్యారని జిల్లా హాకీ అసోసియేషన్ కార్యదర్శి మహమ్మద్ హమీద్ తెలిపారు. గచ్చిబౌలిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చూపి రాష్ట్ర జట్టులో స్థానం సంపాదించాడు. కరీంనగర్ స్టేడియంలో శిక్షణ పొందిన శ్రీరామ్ జాతీయ పోటీలకు ఎంపికవ్వడం ఇది రెండోసారి. ఇతని ఎంపికపై సర్దార్ రవీందర్ సింగ్, సురేందర్ సింగ్, అన్వర్ తదితరులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
శ్రీరామ్ ప్రతిభ: జాతీయ జూనియర్ హాకీ పోటీలకు ఎంపిక




