గూడెం ప్రాథమిక పాఠశాలకు రూ.26 లక్షలతో అభివృద్ధి పనులు – పనులను పరిశీలించిన ఒగ్గు దామోదర్

బెజ్జంకి,జూలై 26(ప్రజావాణి ) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని గూడెం గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేపడుతున్న ప్రహరీ గోడ నిర్మాణ పనులను బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్ పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ విద్యార్థుల భద్రత, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని గూడెం గ్రామ ప్రాథమిక పాఠశాలకు రూ.20 లక్షలతో ప్రహరీ గోడ, రూ.6 లక్షలతో కిచెన్ షెడ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేశారని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు...