📄 ePaper
Monday, July 27, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్తాళ్లపల్లిలో భక్తిశ్రద్ధలతో ఘనంగా పోచమ్మ బోనాల ఉత్సవాలు

తాళ్లపల్లిలో భక్తిశ్రద్ధలతో ఘనంగా పోచమ్మ బోనాల ఉత్సవాలు

📰 Generate e-Paper Clip

ఇల్లంతకుంట, జూలై 26 (ప్రజావాణి)

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల పరిధిలోని తాళ్లపల్లి గ్రామంలో విశ్వకర్మ మనుమయ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పోచమ్మ బోనాల ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో బోనాలు సమర్పిస్తూ పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డప్పు చప్పుళ్ల నడుమ భక్తులు ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ గ్రామ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, అందరికీ ఆయురారోగ్యాలు కలగాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, మంచి వర్షాలు కురవాలని పోచమ్మ తల్లిని వేడుకున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో విశ్వకర్మ మనుమయ సంఘం సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular