గుడిసెలకు పట్టాలు ఇచ్చి న్యాయం చేయాలి
సీపీఐ
హనుమకొండ, జూలై 30:
హన్మకొండ, ప్రజల భూముల రక్షణ, పేదల హక్కుల పరిరక్షణ కోసం సిపిఐ హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు హనుమకొండ మండల డిప్యూటీ తహశీల్దార్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది.
హనుమకొండ మండలంలోని 31వ డివిజన్ పరిధిలోని సర్వే నం. 964లో ఉన్న ప్రభుత్వ భూమిలో 150, కుటుంబాలు, జేపీ నగర్ లో 250 కుటుంబాలు గత 20 సం రాలు గా నివాసం ఉంటున్న పేద కుటుంబాలకు గృహ పట్టాలు ఇవ్వాలని కోరారు. ఆ కుటుంబాల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, వారికి గృహ నిర్మాణ పట్టాలు మంజూరు చేసి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్థిర నివాస హక్కులు కల్పించాలని వినతిపత్రంలో విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ, పేద ప్రజల భూముల రక్షణ కోసం పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని, ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, జిల్లా కౌన్సిల్ సభ్యులు వేల్పుల సారంగపాణి యాదవ్, జిల్లా కార్యవర్గ సభ్యులు కొట్టేపాక రవి, స్థానిక సిపిఐ నాయకులు అలకుంట్ల యాకయ్య,అలకుంట్ల మల్లయ్య, కంచెర్ల కుమారస్వామి, నోముల కిషోర్,ఎన్నం వెంకటేశ్వర్లు బాధిత కుటుంబాల ప్రతినిధులు పాల్గొన్నారు.
గుడిసెలకు పట్టాలు ఇచ్చి న్యాయం చేయాలి సిపిఐ
RELATED ARTICLES




