*జిల్లా మహాసభలను విజయవంతం చేయండి*
* *మన ప్రజావాణి*, మందమర్రి:- జులై 30
జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలో ఆగస్టు 2న నిర్వహించనున్న ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) 4వ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్ పిలుపునిచ్చారు. గురువారం ఏరియాలోని కాసీపేట 1 గని పై మహాసభ వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడుతూ, ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాలరాజు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య లు హాజరవుతున్నారని తెలిపారు. ఈ మహాసభలకు సంఘటిత, అసంఘటిత కార్మికులు, ఆర్టీసీ, మెడికల్, ఆశ, అంగన్వాడి, సింగరేణి కార్మికులు అధిక సంఖ్యలో హాజరై, జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ గని పిట్ కార్యదర్శి మీనుగు లక్ష్మీనారాయణ, నాయకులు వి రాజేందర్, పార్వతి సురేష్, జె రంజిత్ కుమార్, అశోక్, బల్లెం శ్రీనివాస్, కే సంతోష్, ఆడే రవీందర్, బియ్యాల రాజన్న, రాజు, వెంకటేష్, భాస్కర్ లు పాల్గొన్నారు.
జిల్లా మహాసభలను విజయవంతం చేయండి
RELATED ARTICLES




