📄 ePaper
Monday, May 11, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్గుంటూరులో రేషన్ రచ్చ.! అసలు నిజం ఏంటి?

గుంటూరులో రేషన్ రచ్చ.! అసలు నిజం ఏంటి?

📰 Generate e-Paper Clip

గుంటూరుజిల్లా ప్రజావాణి న్యూస్ (మే05) గుంటూరుజిల్లా లో రేషన్ బియ్యం వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.రేషన్ డీలర్లు ఒకవైపు, ప్రభుత్వ అధికారులు మరోవైపు ఇద్దరూ ఎవరికి వారు తామే కరెక్ట్ అంటున్నారు.గొడవ ఎలా మొదలైంది.రెండు రోజుల క్రితం పౌరసరఫరాల శాఖ అధికారులు జిల్లాలోని రేషన్ షాపులపై ఆకస్మిక దాడులు చేశారు.అధికారులు 34 రేషన్ షాపుల్లో బియ్యం లెక్కల్లో తేడాలు ఉన్నాయి.స్టాక్ రిజిస్టర్‌లో ఉన్న బియ్యానికి,షాపులో ఉన్న బియ్యానికి పొంతన లేదు.కొందరు డీలర్లు ప్రజలకు ఇవ్వాల్సిన బియ్యాన్ని బయట బ్లాక్‌లో అమ్ముకుంటున్నారు.వెంటనే 34 షాపులను సీజ్ చేశారు. డీలర్లపై కేసులు పెట్టారు.డీలర్లు ఏమంటున్నారు.దీనిపై రేషన్ డీలర్ల సంఘం తీవ్రంగా మండిపడుతోంది.మా తప్పు ఏమీ లేదు.మా లెక్కలన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి.అధికారులే కావాలని బయటి నుంచి బియ్యం బస్తాలు తెచ్చి మా షాపుల్లో పెట్టి,ఎక్కువ స్టాక్ ఉంది అని తప్పుడు కేసులు బనాయిస్తున్నారు.మమ్మల్ని వేధించడానికే ఇదంతా చేస్తున్నారు.అని వాపోతున్నారు.పౌరసరఫరాల శాఖ అధికారులు డీలర్ల ఆరోపణలను ఖండిస్తున్నారు.కొంతమంది డీలర్లు రేషన్ మాఫియాతో కుమ్మక్కై ప్రజల బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు.మా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి. అందుకే తనిఖీలు చేసి తప్పు చేసిన వారిపై మాత్రమే చర్యలు తీసుకున్నాం.నిజాయతీపరులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.ఈ వివాదం ముదరడంతో జిల్లా కలెక్టర్ రంగంలోకి దిగారు.కలెక్టర్ ఆదేశం మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరపండి.ఎవరు తప్పు చేసినా,అది డీలర్ అయినా,అధికారి అయినా ఉపేక్షించేది లేదు. కఠిన చర్యలు తప్పవు అని స్పష్టం చేశారు.అస్సలు కంగారు పడొద్దు.మీ కార్డు ఉన్న రేషన్ షాపును సీజ్ చేసినా మీకు ఎలాంటి నష్టం లేదు.ఎలా అంటే పోర్టబిలిటీ సౌకర్యం ఉంది,మీకు దగ్గరలో ఉన్న ఏ రేషన్ షాపుకైనా వెళ్లండి.అక్కడ మీ వేలిముద్ర ఫింగర్ ప్రింట్ వేసి మే నెలకు సంబంధించిన మీ కోటా బియ్యాన్ని యథావిధిగా తీసుకోవచ్చు.మీ బియ్యం మీకు రాకుండా ఎవరూ ఆపలేరు.ఇప్పుడు బంతి కలెక్టర్ కోర్టులో ఉంది. విచారణ పూర్తయి నిజం బయటపడే వరకు వేచి చూడాలి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular