📄 ePaper
Monday, July 13, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్గడువులోపు ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించండి-సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య

గడువులోపు ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించండి-సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య

📰 Generate e-Paper Clip

బెజ్జంకి, జూలై 12(ప్రజావాణి )

 

ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా గడువులోపు ఎన్యుమరేషన్ ఫారాలను తప్పనిసరిగా బీఎల్‌ఓలకు సమర్పించాలని గుగ్గిళ్ల గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య గ్రామ ప్రజలకు సూచించారు.సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామంలో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని ఆయన ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఎన్యుమరేషన్ ఫారాలను పూర్తి చేసి సమర్పించేలా బీఎల్‌ఓలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.గడువులోపు ఫారాలు సమర్పించని వారు ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందువల్ల గ్రామ ప్రజలందరూ ఆలస్యం చేయకుండా తమ ఎన్యుమరేషన్ ఫారాలను సమర్పించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కొంపెల్లి వంశీధర్, బీఎల్‌ఓ కొంకటి అశోక్, క్షేత్ర సహాయకులు ర్యాకం రాజు, మైల బాలయ్య, చిట్టి రాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular