రూరల్ ఎంప్లాయిమెంట్ అండ్ అగ్రికల్చర్ ఫార్మా డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో “టైమ్ బ్యాంకింగ్” కార్యక్రమానికి దరఖాస్తులు ఆహ్వానం
యువతకు సేవా అవకాశాలతో పాటు నాయకత్వ నైపుణ్యాలు – అనుభవ ధృవీకరణ పత్రం కూడా అందజేయబడుతుంది
కామారెడ్డి మరియు నిజామాబాదు జిల్లా, తెలంగాణ | తేదీ: _12/07/2026
సమాజాభివృద్ధిలో యువత భాగస్వామ్యాన్ని పెంపొందించడం, సేవా భావాన్ని ప్రోత్సహించడం మరియు యువతకు నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించడం లక్ష్యంగా రూరల్ ఎంప్లాయిమెంట్ అండ్ అగ్రికల్చర్ ఫార్మా డెవలప్మెంట్ ట్రస్ట్ ప్రతిష్ఠాత్మకంగా “టైమ్ బ్యాంకింగ్ (Time Banking)” కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో 15 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల నిరుద్యోగ యువత, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ మరియు ఇతర విద్యార్థులు పాల్గొనే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
టైమ్ బ్యాంకింగ్ అనేది డబ్బుకు బదులుగా సమయాన్ని సేవగా సమాజానికి అందించే వినూత్న విధానం. ఇందులో పాల్గొనే యువత సమాజ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములై, సేవా గంటలను నమోదు చేసుకుంటూ విలువైన అనుభవాన్ని సంపాదించవచ్చు.
ఈ కార్యక్రమం ద్వారా పాల్గొనే వారికి:
నాయకత్వ (Leadership) నైపుణ్యాల అభివృద్ధి
టీమ్ వర్క్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్
సామాజిక సేవలో ప్రత్యక్ష అనుభవం
వ్యక్తిత్వ వికాసం మరియు పని గంటలు ప్రతి ఒక్కరు నెల కి 4-5గంటల సమయం సరిపోతుంది
భవిష్యత్తులో ఉద్యోగాలు, ఉన్నత విద్య మరియు సేవా అవకాశాలకు ఉపయోగపడే అనుభవ ధృవీకరణ పత్రం (Experience Certificate)
అందించబడుతుందని ట్రస్ట్ ప్రతినిధులు ఎం సాయిబాబు, కే గోపి, డి ఓంప్రకాష్ తెలిపారు
ట్రస్ట్ ప్రతినిధి మాట్లాడుతూ…
“ప్రతి యువకుడు తన సమాజానికి కొంత సమయం కేటాయిస్తే, అదే సమయం అతని వ్యక్తిత్వ వికాసానికి పెట్టుబడిగా మారుతుంది. టైమ్ బ్యాంకింగ్ ద్వారా సేవా భావం, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత పెంపొందుతాయి. ప్రతి యువకుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము.”
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
✔ 15–40 సంవత్సరాల మధ్య వయస్సు గల యువత
✔ నిరుద్యోగ యువత
✔ ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ విద్యార్థులు
✔ సమాజ సేవపై ఆసక్తి ఉన్న ప్రతి యువకుడు
రూరల్ ఎంప్లాయిమెంట్ అండ్ అగ్రికల్చర్ ఫార్మా డెవలప్మెంట్ ట్రస్ట్ గ్రామీణాభివృద్ధి, యువజన సాధికారత, వ్యవసాయాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన, పర్యావరణ పరిరక్షణ, నైపుణ్యాభివృద్ధి మరియు సమాజ సేవ రంగాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ గుర్తింపు పొందిన స్వచ్ఛంద సంస్థ. సమాజంలో స్వచ్ఛంద సేవా సంస్కృతిని పెంపొందించడం, యువతను సామాజిక నాయకులుగా తీర్చిదిద్దడం సంస్థ ప్రధాన లక్ష్యం.
రూరల్ ఎంప్లాయిమెంట్ అండ్ అగ్రికల్చర్ ఫార్మా డెవలప్మెంట్ ట్రస్ట్
ఫోన్ నెంబర్: 99519 97184
సేవే సంపద… సమయమే అవకాశం… అవకాశమే అభివృద్ధి.”




