📄 ePaper
Tuesday, July 21, 2026
📄 ePaper
HomeతెలంగాణSuryapetగంజాయిపై పోలీసుల ఉక్కుపాదం.. నార్కోటిక్ డాగ్ ‘రోలెక్స్’తో నేరేడుచర్లలో విస్తృత తనిఖీలు

గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం.. నార్కోటిక్ డాగ్ ‘రోలెక్స్’తో నేరేడుచర్లలో విస్తృత తనిఖీలు

📰 Generate e-Paper Clip

గంజాయి నిర్మూలనకు నార్కోటిక్ డాగ్ ‘రోలెక్స్’తో పోలీసుల విస్తృత తనిఖీలు
నేరేడుచర్ల, మే 29:
జిల్లాలో గంజాయి వంటి మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా నేరేడుచర్ల మండల కేంద్రంలో పోలీసులు శుక్రవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ నరసింహ IPS ఆదేశాల మేరకు డాగ్స్ స్క్వాడ్ సిబ్బంది నార్కోటిక్ డాగ్ ‘రోలెక్స్’ సహాయంతో ఈ తనిఖీలు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.
మండల కేంద్రంలోని హోటళ్లు, టీ దుకాణాలు, మెడికల్ షాపులు, కూరగాయల మార్కెట్లు, బహిరంగ ప్రదేశాల్లో సోదాలు నిర్వహించి అనుమానాస్పద వ్యక్తులను తనిఖీ చేశారు. యువతను మరియు సమాజాన్ని గంజాయి వంటి మాదకద్రవ్యాలు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని, వాటిని పూర్తిగా నిర్మూలించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పోలీసులు పేర్కొన్నారు.
డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు. గంజాయి వినియోగించే వారు, సరఫరా చేసే వారి సమాచారం అందించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular