జలధార, జలహారతి పనుల పరిశీలనకు రానున్న జిల్లా కలెక్టర్: పి డి జోసెఫ్ కుమార్
21( ప్రజావాణి ప్రకాశం జిల్లా బ్యూరో ): స్థానిక మండలంలోని గ్రామాల్లో భూగర్భ జలాలు పెంపొందించాలని లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేకంగా చేపట్టిన జలధార,జల హారతి కార్యక్రమంలో భాగంగా మండలంలో చేపట్టిన పనులను జిల్లా కలెక్టర్ రాజాబాబు బుధవారం పరిశీలిస్తారని జిల్లా డ్వామా పిడి జోసఫ్ కుమార్ తెలిపారు. ఇందులో భాగంగా ఇరిగేషన్, లిఫ్ట్ ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్ శాఖలకు చెందిన అధికారులు మంగళవారం పరిశీలన చేపట్టారు. అనంతరం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో డ్వామా పిడి జోసఫ్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ లక్ష్మీపురం గ్రామం గుండ్లకమ్మ వద్ద చెక్ డాం నిర్మాణంకు ప్రతిపాదించడం జరిగిందన్నారు. అక్కడ చెక్ డాం నిర్మాణం జరిగితే గుండ్లకమ్మ లో మూడు కిలోమీటర్ల వరకు నీరు నిలిచే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనాలు వేసినట్టు తెలిపారు. జిల్లా కలెక్టర్ పరిశీలన అనంతరం చెక్ డాం నిర్మాణం నిమిత్తం నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ పథకం ద్వారా దొనకొండ మండలంలోని 46 చెరువులకు గ్రావిటీ మేర నీళ్లు నింపుకునే అవకాశం ఉందన్నారు. దీంతో మండలంలో భూగర్భ జలాలు పెంపొంది బోర్లు పనిచేస్తాయన్నారు. సాగునీరు రైతులకు అందుబాటులో ఉంటుందన్నారు. ఈ పూర్తి సమాచారంను సంబంధిత అధికారులు జిల్లా కలెక్టర్ కు క్షుణ్ణంగా వ్యవహరించడం జరుగుతుందని అనంతరం ప్రభుత్వంకు నివేదిక ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ ఇ వరలక్ష్మి, లిఫ్ట్ ఇరిగేషన్ ఈ ఈ భాగ్యలక్ష్మి, ఇరిగేషన్ డి ఈ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో వసంతరావు నాయక్, ఏ ఇ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
జల ధార జలహారతి పనుల పరిశీలనకు రానున్న జిల్లా కలెక్టర్ పిడి జోసెఫ్ కుమార్
RELATED ARTICLES




