గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం.. నార్కోటిక్ డాగ్ ‘రోలెక్స్’తో నేరేడుచర్లలో విస్తృత తనిఖీలు
గంజాయి నిర్మూలనకు నార్కోటిక్ డాగ్ ‘రోలెక్స్’తో పోలీసుల విస్తృత తనిఖీలు నేరేడుచర్ల, మే 29: జిల్లాలో గంజాయి వంటి మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా నేరేడుచర్ల మండల కేంద్రంలో పోలీసులు శుక్రవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ నరసింహ IPS ఆదేశాల మేరకు డాగ్స్ స్క్వాడ్ సిబ్బంది నార్కోటిక్ డాగ్ ‘రోలెక్స్’ సహాయంతో ఈ తనిఖీలు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు. మండల కేంద్రంలోని హోటళ్లు, టీ దుకాణాలు, మెడికల్ షాపులు, కూరగాయల మార్కెట్లు, బహిరంగ ప్రదేశాల్లో సోదాలు నిర్వహించి అనుమానాస్పద వ్యక్తులను తనిఖీ చేశారు....