ఖమ్మం జిల్లాలో చేప పిల్లలు విడుదలకు రంగం సిద్ధం..!
*4. 60 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం
*సుమారు 16500 మత్స్యకార కుటుంబాలకు లబ్ది
ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి
ఖమ్మం జిల్లాలో 882 నీటి టి లభ్యత ప్రాంతాలలో చేప పిల్లలు విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఎలినో ప్రభావం వలన ఈ ఏడాది ఈ సీజన్లో ఇప్పటివరకు చేప పిల్లలు అందకపోవటంతో మత్స్యకారులు ఆవేదనలు విజ్ఞప్తుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఖమ్మం జిల్లాలోని 882 జలాశయాలలో 3.47 కోట్ల చేప పిల్లలను విడుదల చేసి జిల్లాలోని మత్స్య సహకార సంఘాలను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్న ట్లు మత్స్యకారులు సంఘాల అధ్యక్షులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలలో చేప పిల్లల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం 116 కోట్లు మంజూరు చేయగా ఖమ్మం జిల్లాకు 4. 60 కోట్లు మంజూరు చేసింది. చేప పిల్లల సరఫరాను ఆన్లైన్ టెండర్ ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలిసింది. ఈనెల 17 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఖమ్మం జిల్లాలోని 220 సంఘాలకు పైగా ఉన్న మత్స్యకార సంఘాలకు ఉచిత చేప పిల్లలు అందజేసి సుమారు 16,500 మంది మత్స్యకారులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా మత్స్యకార సంఘాల అధ్యక్షుడు మామిడి వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.





