📄 ePaper
Saturday, July 4, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetకోహెడ మండలంలోని శనిగరం గ్రామంలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ శుద్ధి చేసే ప్రక్రియను :జిల్లా...

కోహెడ మండలంలోని శనిగరం గ్రామంలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ శుద్ధి చేసే ప్రక్రియను :జిల్లా కలెక్టర్ కె. హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు..

📰 Generate e-Paper Clip

సిద్దిపేట జిల్లా,మార్చి 11, ప్రజావాణి

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం 99 రోజుల కార్యాచరణలో భాగంగా బుదవారం కోహెడ మండలంలోని శనిగరం గ్రామంలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ శుద్ధి చేసే ప్రక్రియను జిల్లా కలెక్టర్ కె. హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో 99 రోజుల కార్యాచరణలో 10 థీమ్స్ లలో అత్యంత ప్రాధాన్యత కలిగినది మిషన్ భగీరథ ద్వారా ప్రజలకు శుద్ధమైన తాగునీటి సరఫరా చేయడం. వేసవికాలం దృష్టా జిల్లాలో ఎక్కడ కూడా నీటి ఎద్దడి రాకుండా ప్రత్యేకంగా కార్యాచరణ సిద్ధం చేసినట్లుగా తెలిపారు. మిషన్ భగీరథ అధికారులు ఎల్లపుడు గ్రామాల్లో నీటి సరఫరా గూర్చి పర్యవేక్షణ చేస్తూ ఎలాంటి సమస్యలు ఎదురైన ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రజలకు నీటి సరఫరా చేయాలని ఆదేశించారు. గ్రామంలో పంచాయతీ కార్యదర్శి, ప్రజాప్రతినిధులుగా సర్పంచ్, వార్డు సభ్యులు మీ గ్రామంలో తాగునీటి సమస్యలు ఎదురైన మిషన్ భగీరథ అధికారులతో కలిసి పని చెయ్యాలని తెలిపారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular