షాద్‌నగర్ చౌరస్తా రోడ్డు విస్తరణకు వినతిపత్రం అందజేసిన జాతీయ బీసీ సేన నాయకులు
షాద్‌నగర్: పట్టణంలోని ప్రధాన చౌరస్తా రోడ్డు విస్తరణ పనులను త్వరితగతిన ప్రారంభించాలని కోరుతూ బీసీ సేన నాయకులు ఆర్డీవో ఎన్.ఆర్. సరిత, తహసీల్దార్ నాగయ్య, ఆర్ అండ్ బీ శాఖ సహాయ ఇంజనీర్ (ఏఈ), మున్సిపల్ కమిషనర్ సునీత, మున్సిపల్ చైర్మన్ అగ్గనూరు బస్వం గార్లకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బీసీ సేన రాష్ట్ర అధ్యక్షులు వరప్రసాద్ మాట్లాడుతూ, షాద్‌నగర్ ప్రధాన చౌరస్తాలో రోజురోజుకూ ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోందని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా రోడ్డు విస్తరణ పనులను ప్రభుత్వం తక్షణమే ప్రారంభించాలని ఆయన కోరారు.
వినతిపత్రాన్ని స్వీకరించిన అధికారులు చౌరస్తా విస్తరణకు సంబంధించిన అంశాలను సమగ్రంగా పరిశీలించి, ప్రభుత్వ అనుమతులు మరియు అవసరమైన ప్రక్రియలు పూర్తయిన వెంటనే రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో షాద్‌నగర్ నియోజకవర్గం ఇన్‌చార్జి, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ప్యాట జయ శ్రీకాంత్,రంగా రెడ్డి సోషల్ మీడియా అధ్యక్షులు గిరిబాబు, చేవెళ్ల నియోజకవర్గం అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, షాద్‌నగర్ టౌన్ అధ్యక్షురాలు కే సరస్వతి, తదితరులు పాల్గొన్నారు




