విజయవాడ జూలై 03 ప్రజావాణి రాజకీయ యవనికపై ఒక ప్రభంజనంలా దూసుకొచ్చిన వంగవీటి రంగ.ఆయన్ని అభిమానించే లక్షలాది మంది గుండెల్లో ఆయన భౌతికంగా దూరమైనా,రంగన్న’గా నేటికీ సజీవంగానే ఉన్నారు.కేవలం ఒక నాయకుడిగా మాత్రమే కాకుండా,పేదలు, కార్మికులు మరియు బలహీన వర్గాల పక్షపాతిగా ఎదిగారు.ఆరంభం మరియు రాజకీయ ప్రస్థానంకృష్ణా జిల్లా కాటూరులో జన్మించిన రంగ,ఆ తర్వాత విజయవాడను తన రాజకీయం విద్యార్థి దశ నుంచే ప్రజల సమస్యలపై పోరాడే గుణాన్ని అలవర్చుకున్న ఆయన,కాంగ్రెస్ పార్టీ ద్వారా క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు.కార్మిక పక్షపాతి: విజయవాడలో రిక్షా కార్మికులు, లారీ క్లీనర్లు, మరియు మురికివాడల ప్రజల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాలు ఆయన్ను అపారమైన ప్రజాదరణకు దగ్గర చేశాయి.కౌన్సిలర్ నుండి ఎమ్మెల్యేగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్‌గా ఎన్నికై తన ప్రస్థానాన్ని ప్రారంభించి,ఆ తర్వాత 1985లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా (ఎమ్మెల్యే) రికార్డు స్థాయి ప్రజాదరణతో గెలుపొందారు.
పేదల పాలిట ఆపద్బాంధవుడురంగ ప్రత్యేకత ఏమిటంటే,ఆయన కేవలం ఓట్ల కోసం రాజకీయాలు చేయలేదు.అర్ధరాత్రి అయినా సరే తన ఇంటి తలుపు తట్టిన ఏ పేదవాడికైనా సాయం చేయడానికి ఆయన వెనుకాడేవారు కాదు. విజయవాడ నగరంలో అప్పట్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా “రంగన్న ఉన్నాడు”అనే ధీమా ఉండేది.”రాజకీయ బలానికంటే.ప్రజా బలమే మిన్న”అని నమ్మిన అతికొద్ది మంది నాయకులలో వంగవీటి రంగ ప్రథములు.ఆయన నాయకత్వంలో ఎదిగిన ఎందరో నేతలు నేటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు నవ్యాంధ్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.నేటికీ వీడని ఆదరణ1988 డిసెంబర్‌లో ఆయన అకాల మరణం చెందినప్పటికీ,ఆయనపై ఉన్న ప్రజాభిమానం రవ్వంత కూడా తగ్గలేదు. కులమతాలకు అతీతంగా,ముఖ్యంగా వెనుకబడిన,దళిత వర్గాల ప్రజలు ఆయన్ను తమ సొంత అన్నలా భావిస్తారు. నేటికీ తెలుగు రాష్ట్రాల్లో ఆయన విగ్రహాలు,ఆయన పేరిట జరిగే సేవా కార్యక్రమాలే అందుకు నిదర్శనం.ఈ రోజు ఆయన 79వ జయంతి సందర్భంగా అభిమానులు,నాయకులు రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా రక్తదాన శిబిరాలు,పేదలకు అన్నదానాలు, వస్త్రదానాలు వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆయన ఆశయాలను స్మరించుకుంటున్నారు.ప్రజా హృదయ విజేత వంగవీటి మోహన రంగ జయంతి సందర్భంగా ఆ మహానాయకునికి ఘన నివాళులు!* బొల్లు రామమోహన్, రచయిత,పోరుమామిళ్ల
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన ప్రజా నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగ 79వ జన్మదినం నేడు
RELATED ARTICLES



